ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక సమాచారం కోసం 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: నెల్లూరు కలెక్టర్ కార్యాలయం, తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజనల్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం 1100కు ఫోన్ చేయవచ్చు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏదశలో వుందో సమాచారం తెలుసు కోవటం కోసం కాల్ సెంటర్ నెంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.