అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వైవి రామిరెడ్డి అరెస్ట్
నెల్లూరు: జిల్లాలో పలు ఆక్రమాలకు పాల్పపడిన వైసీపీ నేతల అరెస్టుల పర్వం ప్రారంభం అయిందని అధికారపార్టీ నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు..2019 నుంచి 2024 వరకు సీజింగ్ లో వున్న మైన్స్ నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానేట్,కంకరలను SLV క్రషర్ నుంచి ఆక్రమంగా వైసీపీ నేత వైవి రామిరెడ్డి తరలించారని ? సంబంధిత MRO ఫిర్యాదు చేయడంతో,ఇతనిపై రాపూరు పోలీసులు కేసు నమోదు చేశారు.. ఈ విషయంమై రాపూరు పోలీసులు మాట్లాడుతూ వైసీపీ నేత వైవి రామిరెడ్డి, సీజ్ చేసిన SLV క్రషర్ లోనిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేశారని,,సీజ్ చేసిన క్వారీలో కంకర తరలింపుతో పాటు మైనింగ్ చేయడంతో అధికారులు రూ.100 కోట్లు ఫైన్ విధించారు..ఫైన్ కట్టక పోవడంతో పాటు సీజ్ చేసిన క్రషర్ లో మైనింగ్ చేశారంటూ ఫిర్యాదు అందడంతో వైవి రామిరెడ్డిపై ఐపిసి 427, 379 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వెంకటగిరి కోర్టు తరలించడం జరిగిందని అధికారి తెలిపారు.