నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా విక్రయాలు జరపాలి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నందున నెల్లూరు నగరపాలక సంస్థ నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా విక్రయాలను జరపాలని కమిషనర్ సూర్యతేజ సోమవారం పేర్కొన్నారు..జనసమూహం ఉన్న ప్రదేశాల్లో బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకొని, దుకాణాలను తొలగిస్తామని కమిషనర్ హెచ్చరించారు. కింద సూచించిన ఆయా ప్రదేశాల్లో మాత్రమే బాణాసంచా విక్రయాలు జరపాలని కమిషనర్ స్పష్టం చేశారు. V.R.C GROUNDS,, Y.M.C.A Grounds,, sarvodhaya college Grounds, R.S.R High Scholl Grounds,, S.V.G.S College Groundsలో మాత్రమే బాణాసంచా విక్రయదారులు తమ దుకాణాలను ఏర్పాటు చేసుకొని విక్రయించాలని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ సూచించిన అన్ని రక్షణా చర్యలను, నిబంధనలను ఆయా దుకాణాల్లో తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సూచించారు. అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.