AP&TG

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి వర్గం

ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం రెండున్నర గంటల పాటు జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది..ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దుకు  కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఇసుక పాలసీని రద్దు చేసిన ప్రభుత్వం, కొత్త ఇసుక పాలసీకి ఆమోదం తెలుపుతూ త్వరలో కొత్త ఇసుక పాలసీ విధివిధానాలు విడుదల చేసేందుకు నిర్ణయించింది.. ఆగస్టు 15వ తేది నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది..అలాగే మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే ప్రణాళికలపై కూడా కేబినెట్‌లో చర్చించారు.. పౌరసరఫరాల శాఖ 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు,,కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి 3 వేల 200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది.. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టి, నిర్మాణ రంగాన్ని కుదేలు చేసిన, గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని, ప్రైవేటు కంపెనీలకు లబ్ది చేకూర్చటానికి చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసింది.. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుపై విధివిధానాలను ఖరారు చేసేందుకు కమిటీ వేయాలని మంత్రి వర్గం నిర్ణయిస్తూ ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది..ఈ కమిటీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. ఈ నెల 22వ తేది నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది..ఇటీవల ప్రభుత్వం వరుసగా విడుదల చేసిన శ్వేతపత్రాలను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.. ప్రభుత్వ విధానాలు, పనితీరుపై కొత్త మంత్రులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు..రాష్ట్రంలో లోటు బడ్జెట్‌ ఉందన్న విషయంను మంత్రులు మనస్సులో వుంచుకుని పనిచేయాలని,,వారికి సంబంధించి శాఖలపై అంశాల వారిగా ప్రతినెలా సమీక్ష చేయాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *