అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం-వాకౌట్ చేసిన వైసీపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు.. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి,,పాలన చేపట్టిన నాటినుంచి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామని,, మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేశామని చెప్పారు..2027 లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.. గవర్నర్ ప్రసంగం సమయంలోనే వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు..అసెంబ్లీకి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోపాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు,,ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు.. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు.. నంతరం సభను వాకౌట్ చేశారు.