AP&TG

కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది-చంద్రబాబు

అమరావతి: నవ్యంధ్రాకు రెండు కళ్ళు అయిన అమరావతి,, పోలవరం,, రెండూ పొడిచేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి జగన్ రెడ్డి నెట్టేసాడని,,ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఒక్కోటి సరిద్దిదుకుంటూ అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.. సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడుతూ,, పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు..గొల్లపల్లి, బనకచర్లకు మూడు దశల్లో అనుసంధానం చేయవచ్చన్నారు..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదని తెలిపారు..చైనాలో ఉండే త్రీ జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తయిన ప్రాజెక్టు అని అన్నారు..

రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని,, అప్పటి కాంట్రాక్టర్‌ను మార్చి రాటిఫికేషన్‌కు పంపించారు దుర్మార్గులు అంటూ మండిపడ్డారు..వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారన్నారు.. 2020లో కాపర్ డ్యాం గ్యాప్‌ను కట్టకపోవడంతో వరద వలన డయాఫ్రం వాల్ దెబ్బతిందని, ఇప్పుడు డీ వాల్ కట్టాలంటే రూ.2400 కోట్లు అదనంగా అవుతుందన్నారు.. కేంద్రం పోలవరంకు ఇచ్చిన నిధులను మళ్ళించారన్నారని,, ప్రాజెక్టుకు సంబంధించి సివిల్ వర్క్స్ 71.3 శాతం తాము చేస్తే, వారు కేవలం 3.5 శాతం మాత్రమే చేశారని వెల్లడించారు.. వచ్చే ఏడాది జనవరి 2వ తేదిన డయాఫ్రం వాల్ పనులు ప్రారంభిస్తామని,, 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అన్నారు.. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అధికారులకు సూచించాను అని అన్నారు.. ఆర్‌అండ్ఆర్ ప్యాకేజ్‌ను 2026 నాటికి పూర్తి చేస్తామన్నారు.. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయని,, వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *