మీ పండుగలు ప్రశాంతంగా జరుపుకొని ఇతరుల పండుగలు జరక్కూడదంటే ఎలా?-యోగి
అమరావతి: సంభాల్ ఘర్షణల గురించి తెలుసుకోవాలంటే 1947 సంవత్సరానికి వెళ్లాలి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు..సోమవారం అసెంబ్లీ శీతకాల సమావేశాలు జరుగుతున్న సందర్బంలో ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ వివాదంపై విపక్షాలు నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నయంటూ ముఖ్యమంత్రి యోగి విరుచుకుపడ్డారు..శుక్రవారం ప్రార్థనల సమయంలో రెచ్చగొట్టే ఉపన్యాసాల కారణంగానే సంభాల్‌లో వాతావరణం దిగజారినట్టు చెప్పారు..1974లో 184 మంది హిందువులను సజీవదహనం చేశారని,, 209 మంది హిందువులను చంపారని తెలిపారు..ఇటీవల చోటుచేసుకున్న సంభాల్ హింసాకాండకు కారకులు ఏవరు అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి వుందన్నారు..అధికారులు,పోలీసులపై రాళ్లు రువ్విన వారెవరు? ఆంటూ విపక్షలను నిలదీశారు..వాళ్లెవరరైనా సరే విడిచిపెట్ట లేదన్నారు..
“ముస్లింల ఊరేగింపులు హిందువులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్తుంటాయి..అలాంటప్పుడు హిందూ శోభాయాత్ర ముస్లిం ప్రాంతం నుంచి ఎందుకు వెళ్లకూడదు ? మీ పండుగలు ప్రశాంతంగా జరుపుకొని ఇతరుల పండుగలు జరక్కూడదంటే ఎలా?” అని యోగి ప్రశ్నించారు..”జై శ్రీరామ్” అనే నినాదం రెచ్చగొట్టే నినాదం కాదని,,ఉత్తరప్రదేశ్‌లో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు,, మాట్లాడుకునేటప్పుడు ”రామ్ రామ్” అని సంబోధించుకుంటారని, ఏ పని చేసినా రాముడిని తలుచుకునే చేస్తారని అన్నారు.