చెంచలగూడ జైలు నుంచి విడుదల కానున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్..
హైదాబాద్: టాలీవుడ్ స్టార్ నటుడు అల్లు అర్జున్ సినిమాలో సీన్స్ కాకుండా నిజ జీవితంలో కూడా జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది..సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ-11గా ఉన్న ఆయనను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి,,గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు..ఈ కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్‌కి 14 రోజుల రిమాండ్ విధించారు.. ప్రస్తుతం ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.. ఇదే సమయంలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. హైకోర్టులో 4 గంటలకు విచారణ ప్రారంభించిన న్యాయమూర్తి,, ఇరువైపుల వాదనలు పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు..దింతో నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ రద్దు అయింది..హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు చెంచలగూడ జైలు అధికారులకు అందచేసినంతరం,వారు ఫార్మల్టీస్ పూర్తి చేసి,,విడుదల చేసేందుకు సమయం పడుతుంది..ఇప్పటి వరకు అందిన సమాచారం?