కార్పొరేషన్ ప్రాంగణంలో పరిశుభ్రతను పాటించండి-కమిషనర్ సూర్యతేజ
నెల్లూరు: నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో అపరిశుభ్రతకు తావు లేకుండా అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. కార్యాలయం ప్రాంగణంలోని ఫౌంటెన్, క్యాంటీన్, పార్కింగ్ ప్రదేశం తదితరాలను కమిషనర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్న ప్రయాణికుల బగ్గీ వాహనాన్ని రిపేర్లు మరమ్మతులు చేయించి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఫౌంటెన్ ల పనితీరును పరిశీలించి తిరిగి పని చేసేలా అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రామ్మోహన్ రావు, ఈ. ఈ.లు శేషగిరిరావు, రంతు జానీ, సిబ్బంది పాల్గొన్నారు.