ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్, పొట్టి.శ్రీరాములు అమరజీవిలు చిరస్మరణీలు-డిప్యూటీ సీఎం
అమరావతి: భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషిగా మన్ననలు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్,, వర్ధంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పటేల్ చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఉప ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు..
అమరాజీవి:- భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు,, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరహార దీక్ష చేసి ఆత్మబలిదానం చేసి అమరజీవి పొట్టి.శ్రీరాములు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.. ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహనీయుల వర్దంతి, జయంతిలు చేయాలని, భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయాలని అన్నారు. మనుషులకు మరుపు చాలా సహజమని, ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మనం గుర్తు చేసుకుంటామని పవన్ అన్నారు..ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు.. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు..ఆయన దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు.