AP&TG

డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం..

పెట్టుబడులకు ఇబ్బందులు కలగకుండా చట్టం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం వున్నట్లు తెలుస్తొంది. ఈ సమావేశాల్లో పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపుల విషయంలో చట్టపరమైన భరోసా కల్పించేలా బిల్లును రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైనా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *