పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
కుదిరిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీల పొత్తు..
అమరావతి: కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు ఉద్యమంతో 2020 సెప్టెంబర్లో విడిపోయాయిన రెండు పార్టీలు 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఇరుపార్టీలు తమ పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పొత్తును ప్రకటించారు. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేవల్ సింగ్ థిల్లాన్, మాజీ అధ్యక్షులు సునీల్ జాఖర్, అశ్వని కుమార్ సహా సీనియర్ అకాలీదళ్ నేత బల్దేవ్ సింగ్ భుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రకాశ్ సింగ బాదల్ కుమారుడు, సుఖ్బీర్ సింగ్ బాదల్,, ప్రధాని మోదీతో సమావేశమైన సందర్బంలో పొత్తు విషయంపై చర్చలు జరిగినట్లు తెలుస్తొంది.

