ఐటీ హబ్ గా మారనున్ననెల్లూరు జిల్లా-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న నెల్లూరు జిల్లాలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమర్షియల్ భవనాలు, కార్యాలయ స్థలాలు, భూముల యజమానులు తమ వివరాలను itinfra.ap.gov.in వెబ్సైట్లో ఉచితంగా నమోదు చేసి ఐటీ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

