భారత “దృష్టి” శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి
చైనా,పాకిస్తాన్ ల బంకర్లు, వాహనాల కదలికలు..
అమరావతి: భారతదేశ రక్షణ రంగంలోకి ప్రధాని నరేంద్రమోదీ ప్రవేట్ పెట్టుబడులకు గ్రీన సిగ్నల్ ఇచ్చిన తరువాత అనేక అధ్బుతాలు చోటు చేసుకుంటున్నాయి.ఇ:దులో బాగంగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ గెలాక్స్‌ఐ తన తొలి కమర్షియల్ ఉపగ్రహం దృష్టిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాలిఫోర్నియాలోని స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్-9 రాకెట్ సాయంతో ఈ శాటిలైట్ కక్ష్యలోకి చేరింది. ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ శాటిలైట్ దృష్టి అని సంస్థ పేర్కొంది. శాటిలైట్‌లలోని ఎర్త్ అబ్జర్వేషన్ సాంకేతికతలకు సంబంధించి ఇది ఒక మైలురాయి అని పేర్కొంది. ఎలక్ట్రోఆప్టికల్, సింథటిక్ అపర్చర్ రాడార్‌లను ఒకే ప్లాట్ ఫామ్ పైకి తెచ్చిన తొలి ఉపగ్రహం ఇదేనని సంస్థ వెల్లడించింది.
190 కేజీల బరువుతో ఒక రిఫ్రిజ్‌రేటర్ పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందిస్తుంది.ఇప్పటికే డిఫెన్స్ రంగంతో పాటు పౌర సంస్థలు ఈ శాటిలైట్ సేవలపై ఆసక్తి కనబరిచాయని కూడా సంస్థ వెల్లడించింది. గెలాక్స్ ఐ సంస్థ తొలి విజయాన్ని అందుకోవడంపై ప్రధాని మోదీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలియజేశారు.
మేఘాలు అడ్డుగా ఉన్నా, చీకటి ఉన్నా కూడా ‘దృష్టి’ భూమి చిత్రాలు తీయగలదు. ఆప్టికల్ శాటిలైట్‌లు సాధారణ సమయాల్లో హైరిజల్యూషన్ చిత్రాలను అందిస్తాయి. అయితే, రాడార్ శాటిలైట్‌లు పగటి వేళలతో పాటు రాత్రి వేళ, మబ్బులు అడ్డంగా ఉన్న సమయాల్లో కూడా భూ ఉపరితల చిత్రాలు తీయగలవు.అయితే ఈ చిత్రాల నాణ్యత తక్కువగా ఉండటంతో శాస్త్రవేత్తలకు ఇబ్బందులు కలుగుతాయి. ఈ రెండు సాంకేతికతలను ఒకే వేదికపై తీసుకుని రావడంతో “దృష్టి” శాటిలైట్ మరింత మెరుగైన చిత్రాలను తీయగలదని గెలాక్స్ ఐ పేర్కొంది. వ్యవసాయం, మౌలికవసతుల ప్లానింగ్, ఇన్సూరెన్స్ అంచనా వంటి అనేక విభాగాలతో పాటు ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు ఈ శాటిలైట్ సేవలు ఉపయోగపడతాయని కూడా గెలాక్స్‌ఐ వెల్లడించింది.
చైనా,పాకిస్తాన్ ల బంకర్లు, వాహనాల కదలికలు:- భారతదేశ సరిహద్దుల వద్ద అలాగే సరిహద్దులకు అవతలి వైపు శత్రువుల బంకర్లు, వాహనాల కదలికలు, చొరబాట్లను ఎప్పటికప్పుడు అత్యంత ఖచ్చితత్వంతో దృష్టి శాటిలైట్ పసిగట్టగలదు. రక్షణ రంగంలో నిఘా కోసం ఇకపై విదేశీ శాటిలైట్లపై ఆధారపడాల్సిన అవసరం భారతదేశంకు ఉండదు.’ఆపరేషన్ సిందూర్’ వంటి సమయాల్లో బాంబు దాడుల నష్టాన్ని అంచనా వేయడానికి విదేశీ శాటిలైట్లపై ఆధారపడాల్సి వచ్చేది. దేశ సార్వభౌమాధికారం కాపాడుకోవాలి అంటే సొంత కళ్లు అంతరిక్షంలో ఉండాలి. ఆ లోటును ఇప్పుడు ‘దృష్టి’ తీరుస్తుంది.

