వీడియో రికార్డ్ చేస్తుండగానే ఢిల్లీలోని ఓ వ్యక్తి గన్‌తో తన ఛాతిలో కాల్చుకుని మృతి
ఇంద్రప్రస్థ: సోషల్ మీడియాలో రీల్స్ చేసేందుకు,,వెర్రి వెయ్యి తలలు వేస్తే,ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి అనేందుకు మంగళవారం సోషల్ మీడియాలో వైరైల్ అవుతున్న ఓ వీడియో ఉధహరణ…
ఓ ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తుండగానే,,ఈస్ట్ ఢిల్లీలోని దల్లుపురాలో ఓ వ్యక్తి గన్‌తో తన గుండెలపైన కాల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో తీస్తున్న వ్యక్తికి,,తన మిత్రుడు అయిన పవన్ ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆ సంఘటన క్షణాల్లో జరిగిపోయింది. పవన్ అనే యువకుడు పిస్తోల్‌లోని మ్యాగ్జిన్ లోడ్ చేశాడు. ఆ తర్వాత ఆ వెపన్‌ను తన ఛాతిలో పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. మ్యాగ్జిన్లోకి ఎలా బుల్లెట్ పెట్టారో వీడియో తీస్తున్న వ్యక్తి చెప్పాడు. బటన్ క్లిక్ చేస్తే అది లోపలికి వెళ్తుందని పేర్కొన్నాడు. దింతో వవన్,నవ్వుతూ సైలెంట్‌గా గన్ తీసి తన ఛాతిలో కాల్చుకునే ప్రయత్నం చేస్తాడు.సదరు గన్ కు సేప్టి ఫిన్ లాక్ అయినట్లు భావించినట్లు వున్నాడు.అయితే సేఫ్టి లాక్ ఓపెన్ లో వుంది. ఆ సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి ఫైరింగ్ చేయవద్దు అంటు ఆరుస్తాడు. కానీ పవన్ గన్ను ఛాతిలో ఎడమవైపు పెట్టుకుని కెమెరాకు స్మైల్ ఇస్తూ ట్రిగ్గర్ను సడెన్‌గా నొక్కేస్తాడు. అతని శరీరం నుంచి రక్తం చిందే మూమెంట్ కూడా వీడియోకు చిక్కింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ వ్యక్తి మరణించినట్లు తేల్చారు. వీడియోలో ఉన్న పిస్తోల్‌కు లైసెన్స్ ఉంది. ఆ వీడియో తీస్తున్న వ్యక్తిదే ఆ పిస్తోల్. ఈ ఘటనకు చెందిన దర్యాప్తు చేపడుతున్నారు.

