ఢిల్లీ నుంచి పాట్నాకు అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ ఎక్స్ ప్రెస్
అమరావతి: ఢిల్లీ నుంచి పాట్నాకు దీపావళి సందర్భంగా ప్రత్యేక వందేభారత్ ఎక్స్ ప్రెస్ బుధవారం ఢిల్లీ నుంచి రైలు ప్రారంభమైంది..అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలుగా రికార్డు నమోదు అయ్యింది..దాదాపు 994 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణం చేస్తుంది.. ఉదయం 8.25 నిమిషాలకు ప్రారంభంమై సుమారు 11 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణించి రాత్రి 8 గంటలకు పాట్నా చేరుకుంటుంది.. అర్రా,,బుక్సర్,,డీడీయూ,,ప్రయాగ్‌రాజ్,, కాన్పూర్ స్టేషన్లలో దీనికి స్టాప్‌లు ఉన్నాయి..ప్రస్తుతానికి వారంలో మూడు రోజులు ఈ రైలు సేవలు అందిస్తుంది.. ఢిల్లీ నుంచి వందేభారత్ బుధ,,శుక్ర,, ఆదివారాల్లో బయలుదేరుతుంది..పాట్నా నుంచి ఢిల్లీకి సోమ,,గురు,, శనివారాల్లో వస్తుంది..పాట్నా నుంచి ఉదయం 7.30 నిమిషాలకు బయలుదేరి,, ఢిల్లీకి రాత్రి 7 గంటలకు చేరుకుంటుంది..ఈ రైలులో స్లీపర్‌క్లాసు సౌకర్యం లేదు.
దీపావళి స్పెషల్ వందేభారత్ ఎక్స్ ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ టికెట్ ధర 2,575,,ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధర రూ.4655గా నిర్ణయించారు..అలాగే ఢిల్లీ నుంచి పుణెకు కూడా వందేభారత్ రైళ్లను నడపుతున్నారు..నవంబర్ 1, 3, 6 తేదీల్లో ఢిల్లీ నుంచి రైలు బయలుదేరుతుంది..తిరిగి నవంబర్ 2, 4, 7 తేదీల్లో ఉంటాయి..గతంలో ఢిల్లీ నుంచి వారణాసి వరకు(771 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో) ఎక్కువ దూరం వందేభారత్ రైలు ప్రయాణించింది.