ఫారెస్ట్ భూమిలో చెట్లును నరికి వేసిన వివాదంలో కేజీఎఫ్ హీరో యష్ సినిమా
అమరావతి: కర్నాటకలో నెంబరు 1 హీరో అయిన యష్,,కేజీఎఫ్ 2 తరువాత ప్రస్తుతం ఏం సినిమా చేస్తారన్నది సస్పెన్స్ గా వుంది..ఇటీవల సాయిపల్లవి హీరోయిన్‌గా టాక్సిక్ అనే మూవీ షూటింగ్ ప్రారంభించారు..ఈ సినిమా కోసం HMT ఫారెస్ట్ భూమిలో భారీసెట్లు వేశారు..తాజాగా ఇప్పుడు అదే వివాదాస్పదంగా మారింది..ఈ సినిమా షూటింగ్ కోసం ఆ భూమిలో చెట్లన్నీ నరికేశారన్న ఆరోపణలు వచ్చాయి..దీంతో ప్రభుత్వాధికారులు గతంలో శాటిలైట్ చిత్రాలను,,ప్రస్తుతం వున్న పరిస్థితిని సమీక్షించగా, చెట్లు నరికేసినట్లు నిర్థారించుకున్నారు..
విషయం తెలుసుకున్నఅటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే,,యష్ టాక్సిక్ మూవీ షూటింగ్ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు.. చెట్లు నరికివేతపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..పీణ్య సమీపంలో ఉన్న ఈ HMT ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ జరిగింది..నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారని,, అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరమన్నారు..ఎన్ని చెట్లను నరికివేశారు ? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు..మొత్తం 599 ఎకరాల భూమిని ఇదివరకే రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించడం జరిగిందని,, ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అయిందని అధికారులు తెలిపారు..ఈ వివాదం చినికి చినికి గాలి,వానల మారే అవకాశం వుందా ?