రేపటి నుంచి నెల్లూరులో ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు-మంత్రి నారాయణ
నెల్లూరు: రేపటి నుంచి నెల్లూరులో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కట్టేందుకు వీలు లేదని…తాము కేటాయించిన ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు కట్టుకోవాలని… రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా… నెల్లూరు నగరం హరనాథపురం సమీపంలోని సర్వేపల్లి కాలువపై ఆయన ఆకస్మికంగా పర్యటించారు. అనంతరం రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతోనే…2014-2019 మధ్య కాలంలో సర్వేపల్లి కాలువ మీద ఐదు బ్రిడ్జీలు నిర్మించాలని నిర్ణయించామని..అప్పుడు మూడు బ్రిడ్జీలను కూడా మంజూరు చేశామన్నారు. వీటిలో కొన్ని వర్కులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వెంటనే బ్రిడ్జీల నిర్మాణానికి ఎస్టిమేషన్ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించామన్నారు. నెల్లూరులో ఫ్లెక్సీలు కట్టకుండా ఆర్డర్ వేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారన్నారు. ఫ్లెక్సీలంటే నగరానికి అందం రాదన్నారు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు పెట్టుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులో ఉన్న అన్నీ రాజకీయ పార్టీల నాయకులందరూ…ఆ ప్రాంతాల్లోనే ఫ్లెక్సీలు పెట్టాలని సూచించారు. రేపటి నుంచి నెల్లూరులో ఇష్ట ప్రకారం ఫ్లెక్సీలు కట్టేందుకు వీలు లేదని తనదైన శైలిలో హెచ్చరించారు. డెవలప్‌మెంట్ కంట్రీస్ లో ఎక్కడ కూడా ఫ్లెక్సీలు ఉండవన్నారు. నెల్లూరు సిటీ స్మార్ట్ గా మారాలంటే…ఫ్లెక్సీలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదన్నారు. ఆల్ రెడీ చెన్నైలో కూడా ఫ్లెక్సీలపై జీవో ఉందన్నారు. ఆ జీవోని తెప్పించాలని ఇప్పటికే సబ్ కలెక్టర్‌ని ఆదేశించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ డివైడర్‌లో…కూడా ఫ్లెక్సీలు పెట్టకూడదని ఇప్పటికే ఆదేశించడం జరిగిందన్నారు. ఆ ప్రాంతంలో అందమైన గ్రీనర్ డెవలప్ చేస్తామని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో నగరమంతా గ్రీనర్ ఉండేదని…కానీ ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా విస్మరించిందన్నారు. ఇవన్నీ కూడా వన్ బై వన్ చేస్తామని…అన్నీ ట్రాక్‌లోకి రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.