కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులుదరఖాస్తు చేసుకోండి- కమిషనర్
నెల్లూరు: మేనేజింగ్ డైరెక్టర్ బీ.సీ కార్పొరేషన్ విజయవాడ వారి నుంచి 2024-2025 ఆర్థిక సంవత్సరమునికి బీసీ, ఎకనామికల్లి వీకర్ సెక్షన్, కాపు ( కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులములు ) కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాలకు లోన్లు మంజూరు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సోమవారం తెలియజేశారు..ఈ పథకం ద్వారా వాణిజ్య సముదాయాలు ఏర్పాటుకు, పశువులు కొనుగోలు పెంపకమునకు మెడికల్ షాపులు ఏర్పాటు నిర్వహణ స్వయం ఉపాధిత ఆటో రిక్షా కొనుగోలు చేసి తద్వారా స్వయం ఉపాధి పొందేందుకుగాను లబ్ధిదారులంతా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.. స్థానిక వార్డు సచివాలయ వెల్ఫేర్ కార్యదర్శుల సహకారం పొందాలని ఓ.బి.బి.ఎం.ఎస్. పోర్టల్ ద్వారా ఈనెల 7వ తేదీ వరకు లబ్ధిదారులు దరఖాస్తులను అప్లోడ్ చేయాలని సూచించారు..ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 11 వరకు దరఖాస్తుల పరిశీలన, 12 నుంచి 14వ తేదీ వరకు మండల స్థాయి అధికారులు బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లభ్యదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు.. 17వ తేదీ నుంచి 20 వరకు బ్యాంకర్లు రూపొందించిన లబ్ధిదారుల జాబితాను జిల్లా స్థాయి అధికారులు మంజూరు చేసి, 21 నుంచి 23వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ అనుమతుల కొసం జాబితాను అందచేయడం జరుగుతుందన్నారు..లబ్ధిదారులు తమ ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, లేదంటే సమీప సచివాలయంలోని వెల్ఫేర్ కార్యదర్శి ద్వారా సహాయం పొందగలరని కమిషనర్ సూచించారు.
గమనిక:-ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల లబ్ధిదారులకు షెడ్యూల్ ప్రకటించిన అనంతరం లోన్ల మంజూరు ప్రక్రియను చేపటతామని కమిషనర్ తెలియచేసారు.