ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలను 3 నెలలలోగా పరిష్కరించాలి-కలెక్టర్
నెల్లూరు: జిల్లాలో ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలను మూడు నెలలలోగా పరిష్కరించాలన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన అర్జీలు అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు చేయతగిన పనులను వెంటనే చేపట్టాలన్నారు. చేయలేని పనులపై స్పష్టమైన వివరాలతో తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. లవన్న, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ నాగరాజకుమారి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగాభవాని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి, జిల్లాఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి , మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.