లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి మధ్యంతర బెయిల్ మంజూరు
అమరావతి: పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన ‘లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి గురువారం కలకత్తా హైకోర్టు సింగ్ బెంచ్ జస్టిస్ రాజా బసు చౌదరి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు..రూ.10,000 పూచీకత్తు(బెయిల్ బాండ్) సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.. ‘లా’ విద్యార్థిని అయిన 22 ఏళ్ల శర్మిష్టని కోల్‌కతా పోలీసులు మే 30వ తేదిన గుర్గాంలో అరెస్టు చేశారు.. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..ఈ సోమవారం కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది..అమె వివరాలు బహిర్గతం అయినందున అమెకి తగిన భద్రత కల్పించాలని పోలీసులను అదేశించారు..ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘లా’ విద్యార్థిని శర్మిష్ట పనోలికి మద్దతు ఇస్తూ,,అమెకు అండగా వుంటామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.