అమరావతిని “వేశ్యల రాజధాని”గా సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ కమీషన్
ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్..
(రాజధాని రైతు మహిళలపై అనుచిత వాక్యాలు చేసిన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లో కొమ్మినేని.శ్రీనివాసును అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు నేడు మంగళగిరి కోర్టులో ప్రవేశ పెట్టగా కోర్టు, శ్రీనివాస్ కి 14 రోజులు రిమైండ్ వీధించింది.. శ్రీనివాసును పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మహిళలపై ఇటీవల జగన్ చానల్లో యాంకర్ కొమ్మినేని నిర్వహించిన లైవ్ డిబేట్లో జర్నలిస్టులు చేసిన అసభ్య వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. నిందితులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.. జర్నలిస్ట్ కృష్ణంరాజు టీవీ డిబేట్ సందర్భంగా అమరావతిలోని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది..అమరావతిని “వేశ్యల రాజధాని”గా సంబోధించడం అంటే రాజధాని ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది..
భావప్రకటన స్వేచ్చ పేరుతో:- అసహ్యకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలను తీవ్రంగా జాతీయ మహిళా కమిషన్ ఖండిస్తోందని ఛైర్‌పర్సన్ విజయా రహట్కర్ అన్నారు..నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది..వెంటనే విచారణ జరిపి సంబంధిత చట్టాల ప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ ఆదేశించింది..మూడు రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పంపించాలని కూడా డీజీపీకి జారీ చేసిన ఆదేశాలు పేర్కొంది..
ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు జంప్:- మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు మూడు రోజుల కిందటే విజయవాడలోని తన ఇంటికి తాళం వేసి కుటుంబంతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు..అతని కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి..సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొంటున్నారు..