వెంటాడుతన్న వరుస కేసులు-కాకాణి జైలు నుంచి కాలు బయట పెట్టేనా?
అమరావతి: వరుస కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో కనుచూపు మేరలో వైసీపీ మాజీ మంత్రి,సర్వేపల్లి మాజీ ఎమ్మేల్యే కాకాణి.గోవర్దన్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే సూచనలు కన్పించడం లేదు..ఆక్రమ మైనింగ్ కేసులో రెండు నెలల పాటు పోలీసులకు చిక్క కుండా తప్పించుకున్న కాకాణిని బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేసి,,రిమాండ్ కు పంపించారు..అక్కడి నుంచే కేసుల కథ మొదలు అయిందా?
సోమిరెడ్డిపై అసభ్య పోస్టులు:- రిమాండ్ లో వున్న కాకాణిపై గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డిపై కాకాణి అసభ్య పోస్టుల పెట్టించినట్లు సోమిరెడ్డి అనుచరుడు మేకల.సురేంద్ర ఫిర్యాదు చేయడంతో కాకాణిపై మంగళగిరిలో సీఐడీ కేసు నమోదు చేసింది..దీంతో కాకాణిని పీటీ వారెంట్‌పై నెల్లూరు జైలు నుంచి తీసుకుని వచ్చి గుంటూరు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు..ఈ కేసు విషయమై న్యాయస్థానం కాకాణికి 14 రోజుల రిమాండ్ విధించింది..మళ్లీ కాకాణి గోవర్ధన్‌రెడ్డిని సీఐడీ అధికారులు నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు..
మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ:- సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేయడంతోపాటు, అనుమతి కోసం ఏకంగా అప్పటి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయడంపై సిట్ విచారణ చేస్తోంది..బాపట్ల డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రత్యేక బృందం ఇప్పటికే ఇందులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ విచారించింది..వారి వాంగ్మూలాలను రికార్డు చేసింది..ఈ కేసులో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడు నిరంజన్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించింది..ఈ తంతు అంతా కాకాణి సారధ్యంలోనే జరిగినట్లు ప్రాథమికంగా నిర్దారించినట్లు తెలుస్తొంది..
అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసి:- ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై కాకాణికి అనుచరుడు అయిన వ్యక్తి అక్రమంగా టోల్‌గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి నగదు వసూళ్లకు పాల్పడ్డారని,,ఇందుకు తెర వెనుక కాకాణి వున్నడాని ముత్తుకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో దీనిపై విచారణ సాగుతోంది..
కనుపూరు చెరువులో కోట్ల విలువైన గ్రావెల్:- వెంకటాచలం సమీపంలోని జాతీయ రహదారికి అనుకుని ఉన్న కనుపూరు చెరువులో రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ను వైసీపీ నాయకులు 40 టన్నుల టిప్పర్స్ తో తరలించారు.. ఆ సమయంలో అక్కడి రైతులు చెరువు దెబ్బతింటుందంటూ అడ్డుకున్నా,,వైసీపీ నాయకులు పట్టించుకోలేదు..రైతుల పేరుతో పర్మిట్లు తీసుకుని,,జగన్ అన్న లేఅవుట్లకు తరలించి కోట్ల రూపాయలను వెనక వేసుకున్నారు..వారి వాటా వారికి అందుడంతో అధికార యంత్రంగా కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు..2024 జూన్ లో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత రైతులు చెరువులో ఆక్రమల గ్రావెల్ తవ్వకాలపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది..ఇలా అప్పటిలో కాకాణి నేతృత్వంలో వైసీపీ నాయకులు చేసిన ఆరాచకలు ఒక్కొక్కటి బయటకు వస్తుండడం,,అలాగే కాకాణిపై ఫిర్యాదుల సంఖ్య పెరిగి చాంతాడులా పెరిగి పొతొంది..రాబోయే రోజుల్లో కాకాణి రాజకీయ భవిష్యత్ ఏ విధంగా మారనున్నదొ ? వేచి చూడాల్సిందే మరి.?