దక్షిణకోస్తా రైల్వే జీఎంగా సందీప్ మాధుర్
అమరావతి: విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జీఎంగా సందీప్ మాధుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం సందీప్ మాధుర్ దిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టు హెడ్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖ రైల్వేజోన్‌పై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చూస్తామని విశాఖ ఎంపీ భరత్ తెలిపారు. వాల్తేర్ డివిజన్‌తో విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతమయ్యేందుకు ఇది కీలక చర్య అని పేర్కొన్నారు.


