చిన్నకుమార్తె పలినా అంజని తరపున డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
తిరుపతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరామణలో భాగంగా మంగళవారం రాత్రికి మెట్ల దారిలో తిరుమలకు చేరుకున్నారు..తన ఇద్దరు కుమారైలు, పెద్ద కూతురు ఆధ్య,, చిన్నకుమార్తె పలినా అంజనిలతో కలసి బుధవారం శ్రీవారి దర్శనం చేసుకోనున్నా పవన్,,తన చిన్నకుమార్తె పలినా అంజని కొణిదెల తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు.. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.. పలినా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.