వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే-పవన్ కల్యాణ్
అమరావతి: ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ దేశానికి అవసరమైన మార్పు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.. సోమవారం భారతదేశంకు ఉన్నసమర్ధత రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనని చెప్పారు.. చెన్నైలో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు..‘‘మనసు ఉంటే మార్గం ఉంటుందని,, ముందుగా సంస్కరణలు ప్రారంభిస్తే,,మధ్యలో వచ్చే అడ్డంకులు అధిగమించొచ్చన్నారు.. ఈ పద్దతిలో సమస్యలు లేవని చెప్పలేమని అయితే వాటిని అధిగమించగలం అన్నారు..ఈవీంఎలపై ఆరోపణలు అర్థ రహితం అని వ్యాఖ్యనించారు..
గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్ర కరుణనిధి ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ సూపర్ అన్నారు..అ విధానం ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు..ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయం పున:రలోచించాలని కోరారు..ఒకే సారి ఎన్నికలు జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు,,సమాఖ్య స్పూర్తికి ఎలాంటి ఇబ్బందులు వుండవన్నారు..ప్రతి సంవత్సరం దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఎన్నికలు జరుగుతునే వున్నయని,,దిని వల్ల అభివృద్ది కుంటుపడుతుందన్నారు..జమిలి ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు..2024 ఎన్నికల్లో ఆపజయం తరువాత EVM గురించి మాట్లాడిన వైసీపీ,, 2019లో అవే EVMలతో వైకాపా గెలిచిందని గుర్తు చేశారు..రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కూటమి గెలవబోతోందని పవన్ కళ్యాణ్ చెప్పారు.. ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడని,, ఆయన నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.