జూన్ 9వ వరకు కాకాణికి రిమాండ్ విధించి న్యాయమూర్తి
(55 రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించిన పోలీసు బృందాలు ఆయన బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరిలోని రిసార్ట్ లో ఉన్నట్లు పసిగట్టి ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి.)
నెల్లూరు: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వెంకటగిరి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆదివారం కాకాణిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోమవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జిల్లా పోలీసు ట్రైనింగ్ కాలేజీ నుంచి ఆయనను కోర్టుకు తరలించారు.. వెంకటగిరి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు పోలీసులు తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేదార్,,కాకాణి తరపున నెల్లూరుజిల్లా వైసిపి లీగల్ సెల్ లాయర్ రోజారెడ్డిలు వాదనలు విన్సించారు..ఇరు పక్షాల వాదలను విన్న తరువాత మేజిస్ట్రేట్, మాజీ మంత్రి.కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించారు..దింతో కాకాణిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు.
కాకాణిని అరెస్ట్ చేయడంతో వైసీపీ నేతలు,కార్యకర్తులు నిరసనలు చేపట్టే అవకాశం వుండడంతో, తొమ్మిది పోలీసు వాహనాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు మధ్య వెంకటగిరికి కోర్టుకు తరలించారు..న్యాయమూర్తి ఎదుట కాకాణిని హాజరుపరిచారు..క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం తదితర అభియోగాలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో నమోదైంది..ఈ కేసులో కాకాణి నాలుగో నిందితుడి (ఏ4)గా ఉన్నారు.