AP&TGMOVIESOTHERS

సమంత వచ్చే సంవత్సరం ఓ ఇంటికి ఇల్లాలు కాబోతుందా ?

హైదరాబాద్: నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య రెండో వివాహం చేసుకోవడంతో,,తన మనస్సులో వున్న విషయం బయట పెట్టింది..తాను కూడా పెళ్లికి సిద్ధమైనట్లు చూచాయిగా వెల్లడించింది..ఈ మేరకు సామ్‌ షేర్‌ చేసిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.. 2025లో నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పిల్లల్ని కోరుకుంటున్నట్లు ఆ పోస్ట్‌ లో పేర్కొంది.. 2025లో వృషభ, కన్య, మకర రాశుల వారికి ఎలా ఉందో తెలియజెప్పే జాబితాను పంచుకుంది.. ఈ మూడు రాశుల వారు వచ్చే ఏడాది బిజీబిజీగా గడుపుతారని,,అలాగే ఈ రాశుల వారు వృత్తిపరంగా మెరుగుపడతారని, బాగా డబ్బులు సంపాదిస్తారని కూడా ఉంది..ఇంకా నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని,, పిల్లల్ని కూడా పొందుతారు.. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారట..మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుని మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారని అందులో ఉంది.. ఇందులో ఉన్నవన్నీ జరగాలని కోరుకుంటున్నట్లు సామ్‌ ఈ సందర్భంగా తెలిపారు..అంటే సమంత వచ్చే సంవత్సరం ఓ ఇంటికి ఇల్లాలు కాబోతుందా ?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *