విజన్ ఆంధ్రా-2047 డాక్యుమెంట్‌పై జిల్లాకలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీ.ఎం,డిప్యూటివ్ సీ.ఎంలు
అమరావతి: స్వర్ణాంధ్ర విజన్-2047 పై, పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు..వెలగపూడి సచివాలయం 5 బ్లాక్ లో డిసెంబర్ 11, 12 వ తేదీలలో రెండవ సారి నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ల సదస్సు లో భాగంగా మొదటిరోజు బుధవారం విజన్ ఆంధ్రా-2047 డాక్యుమెంట్‌లో ప్రస్తావించిన “ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి అంచనాలు” పై చంద్రబాబు మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ రోజే గూగుల్ తో MOU చేసుకున్నమని,,టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి అని అన్నారు..మొదటి కాన్ఫరెన్స్ లో చీకటిలో ఉన్నాం..ఇప్పుడు కొద్దిగా వెలుతురులోకి వచ్చాం..విశ్వసనీయత లేకపోవడం వల్ల వెళ్లిపోయిన కంపెనీలు వెనక్కి వస్తున్నాయి..స్పీడ్ ఆఫ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నాం..కలెక్టర్స్ పోటీ పడాలి..సమీక్ష కోసం మీటింగ్ పెట్టుకున్నాం..మొదటిసారిగా ఎప్పుడు చూడని ఇబ్బంది చూస్తున్నాను.. 10లక్షల కోట్లు అప్పులు వున్నాయన్నారు.. 60% కంప్లైంట్ లు భూ కబ్జాలపైనే ఉన్నాయి..గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగింది.. ఎర్రచందనం స్మగ్లర్స్ తయారయ్యారు..బియ్యం అక్రమ రవాణాపై రూట్ లెవల్ కి వెళ్ళాలి..- పోర్ట్ లు, సెజ్ లు కబ్జా చేస్తున్నారు.. 15వేల కోట్లు కేంద్రం ఇచ్చింది..16వేల కోట్లు బయట తీసుకున్నాం..అమరావతికి 31వేల కోట్లు..తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సులు పెడితే కుదరదు.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పై 4 డిపార్ట్మెంట్ లోనే ఫిర్యాదులు ఉన్నాయి..మనం పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం..ఆర్థిక పరిస్థితులను బట్టి అర్హులకు సంక్షేమ పథకాలు ఇస్తాం.. ధాన్యం కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని చెప్పారు.