విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో అగి వున్న ట్రైయిన్ లో అగ్ని ప్రమాదం
అమరావతి: విశాఖ పట్టణం రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..అదివారం కోర్బా నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీలు B6, B7, M1 పూర్తిగా దగ్దమయ్యాయి..రైలులో మంటలు వ్యాపించిన సమయంలో ఏసీ బోగీల్లో వున్న ప్రయాణికులు అప్రమత్తమైన అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చారు..మరికొందరిని స్థానిక రైల్వే సిబ్బంది బయటకు తీసుకువచ్చారు..ప్రయాణికులకు ఎటువంటి ఎలాంటి గాయాలు కాకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు..ఒక్కసారిగా రైలులో మంటలు వ్యాపించడంతో స్టేషన్ లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.. రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని అధికారులు తెలిపారు.. మెయింటేనెన్స్ అనంతరం దానిని తిరుమల ఎక్స్‌ప్రెస్‌గా వినియోగిస్తారని తెలిపారు..ఈ ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.