INTERNATIONALNATIONALOTHERS

ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీకి ఏపీ అనుకూలం-సీఎం చంద్రబాబు

వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశం..

అమరావతి/సింగపూర్: సంస్కరణలతో భారత్ దూసుకుపోతున్న ఆర్ధిక శక్తిగా మారిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్ కీలక చోదక శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధునిక ఆలోచనలు, సంస్కరణలతో భారత్‌ను అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలిరోజు సోమవారం వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భారత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5వ జనరేషన్ ఫైటర్ జెట్‌లు సహా వివిధ రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేసేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవుతున్నాయని సీఎం వివరించారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా ఆంధ్రప్రదేశ్‌లో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలియచేశారు. ఏపీకి అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA), గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ లాంటి పరిశ్రమలకు వేగంగా అనుమతులు, భూములు కేటాయించామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఏపీలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇదే సరైన సమయం అని.. పెట్టుబడిదారులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. శ్రీసిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామికవాడలు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు.

షిప్ బిల్డింగ్ పరిశ్రమకు ఏపీ అనుకూలం:- సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. ఏపీలో కొత్తగా అందుబాటులోకి పోర్టులు అందుబాటులోకి వస్తున్నందున షిప్ బిల్డింగ్‌, సివిల్ ఏవియేషన్, మెయింటెనెన్సు, రిపేర్స్ ఓవర్ హాలింగ్ కేంద్రాలకు నెలకొల్పేందుకు అవకాశం ఉందని తెలిపారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సింగపూర్ సహకారం కోరుతున్నామని అన్నారు. సింగపూర్-ఏపీ విద్య సంస్థల మధ్య భాగస్వామ్యం ఏర్పాటుకు కృషి చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశానికి మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *