ఇళ్ల నిర్మాణం,రిపేర్లు చేసే వారు రోడ్లపైన వ్యర్థాలను వేయకూడదు-కమీషనర్ నందన్
ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లు…
నెల్లూరు: స్వచ్ఛ సర్వేక్షణ 2025-26 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భవన నిర్మాణ-కూల్చివేతకు సంబంధించిన భవన వ్యర్థాల నిర్వహణపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని నగర పాలక సంస్థ కమిషనర్ నందన్ ఒక ప్రకటనలో నగర ప్రజలకు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నెల్లూరు నగరాన్నిపరిశుభ్రంగా-హరితంగా ఉంచేందుకు భవన యజమానులు నిర్మాణ, మరమ్మత్తు లేదా కూల్చివేత పనులు చేపట్టే ముందు సరైన విధంగా వ్యర్థాల నిర్వహణకు సహకరించాలని ఇందులో భాగంగా నిర్మాణ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై లేదా ప్రజలు సంచరించు ప్రదేశాలలో పడేయకూడదన్నారు.
టోల్ ఫ్రీ నంబర్లు:- నిర్మాణ వ్యర్థాల తొలగింపు కోసం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది: 📞 0861-2356777–📞 0861-2316777. నగర ప్రజలు పై టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించి తమ భవన నిర్మాణ వ్యర్థాలను నగరపాలక సంస్థ వారు నిర్దేశించిన విధంగా తొలగించుకోవాలని సూచించారు.

