NATIONAL

రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం-ఐఎండీ

అమరావతి: దేశంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి.  రానున్న నాలుగైదు రోజుల పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు (హీట్ వేవ్స్​) వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్​ 20 నుంచి ఏప్రిల్ 25 మధ్య హరియాణా, చండీగఢ్​, దిల్లీ, పంజాబ్​, తూర్పు రాజస్థాన్​, విదర్భ, ఛత్తీస్​గఢ్​, పశ్చిమ ఉత్తరప్రదేశ్​, పశ్చిమ రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, గంగానది పరివాహక పశ్చిమ బంగాల్, ఝార్ఖండ్​, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో, తూర్పు ఉత్తరప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

విపత్తుల నిర్వహణ సంస్థ:- రాష్ట్రంలో వేడి, గాలులు, వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం 54 మండలాల్లో తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని, వీటిలో 15 మండలాల్లో తీవ్ర గాలులు వీస్తాయని ఆయన అన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాము.

సోమవారం మన్యం(జి) మక్కువలో 44.2°C, కర్నూలు(జి) చిప్పగిరిలో 43.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. 289 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *