BUSINESSNATIONALOTHERS

భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు..ప్రధాని మోదీ

అమరావతి: భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య ప్రస్తుతం వున్న 27 బిలియన్ డాలర్లుగా ఉన్న పెంచేందుకు ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాన మంత్ర నరేద్ర మోదీ వెల్లడించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చారు. ఇరు దేశాల మధ్య సోమవారం పలు ఒప్పందాలు కుదిరాయి. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇది కీలక ముందడుగు అని అన్నారు. భారత్, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా టెక్నాలజీ, రక్షణ, షిప్‌ బిల్డింగ్, ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో విస్తరిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకు, వివిధ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కూడా కుదిరినట్లు సమాచారం. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, టెక్నాలజీ, ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *