NATIONALOTHERSWORLD

హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు..ఇరాన్ పై బూతులతో పోస్టులు పెట్టిన ట్రంప్

అమెరికాకు నరక ద్వారాలు:-

అమరావతి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హోర్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌ను డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో బూతులతో నిండిన పోస్ట్ పెట్టారు. మంగళవారం నుంచీ ఇరాన్‌లో నరకం తప్పదని హెచ్చరించారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఇరాన్ లో పరిస్థితి దిగజారుతుందని హెచ్చరించారు.‘మంగళవారం పవర్ ప్లాంట్స్‌,,బ్రిడ్జ్‌ లపై దాడులు ఒకే సారి కలిసి జరుగుతాయన్నారు.ఇలాంటి దాడులను ఇంతకు ముందే ఎప్పుడు చూసి ఉండరంటూ బెదిరించారు. హోర్ముజ్‌ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది, చూస్తూ ఉండండి’ అంటూ బూతులతో ట్రంప్ విరుచుకుపడ్డారు.

ఇరాన్- అమెరికాకు నరక ద్వారాలు:- ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై ఇరాన్ శనివారం ధీటుగా స్పందించింది. ఇరాన్‌లో మౌలిక వసతులపై దాడులు జరిగితే, అమెరికాకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు అన్నిటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *