వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో మరో పెద్ద విజయం సాధించిన ఇస్రో
అమరావతి: వాణ్యిజపరమైన శాటిలైట్స్ ప్రయోగంలో ఇస్రో మరో పెద్ద విజయం సాధించింది.ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం 8.55 నిమిషాలకు అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.LVM3-M6 భారీ రాకెట్ ద్వారా ఆ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించారు. ఇస్రో కేంద్రం నుంచి ఎగిరిన సుమారు 15 నిమిషాల తరువాత శాటిలైట్ దాదాపు 520 కిలోమీటర్ల ఎత్తులో విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(NSIL), అమెరికాకు చెందిన AST స్పేస్‌మొబైల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా బ్లూబర్డ్ శాటిలైట్‌ను ప్రయోగించారు. లో ఎర్త్ ఆర్బిట్ నుంచి బ్లూబర్డ్ శాటిలైట్ మొబైల్ సర్వీసులు అందించేందుకు ఈ ప్రయోగించారు. లో ఎర్త్ ఆర్బిట్‌లో నుంచి సేవాలు అందించే అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్‌గా దీన్ని పరిగిణిస్తున్నారు.

