T20 ప్రపంచ కప్ 2026కు షెడ్యూల్ ను విడుదల చేసిన ఐసిసి
అమరావతి: T20 ప్రపంచ కప్ 2026కు సంబంధించి మంగళవారం ICC షెడ్యూల్ విడును అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరుగుతుంది..2026 మెగా టోర్ మంట్ లో 20 జట్లు పాల్గొనున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, ఒమన్, వెస్టిండీస్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇటలీ మొదటి సారి టోర్నీకి అర్హత సాధించింది. 20 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8లోని నాలుగు జట్లను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. ఇందులో టాప్-2 జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ మ్యాచ్లు భారత్లోని అయిదు వేదికల్లో (అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబయి), శ్రీలంకలోని మూడు వేదికల్లో (పల్లెకెలె స్టేడియం, కొలంబోలోని రెండు స్టేడియాల్లో) జరగనున్నాయి.

