2028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ-మంత్రి నారాయణ
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడులు..
20 కోట్లతో అంతర్జాతీయ ప్రభుత్వ పాఠశాల..
మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం..
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తున్నాం..
అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనుల పరిశీలన..
నెల్లూరు: నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్‌లో వక్ఫ్ బోర్డు స్థలంలో 20 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను మంత్రి నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో కలిసి ఆదివారం పరిశీలించారు. వచ్చే విద్యాసంవత్సరంలోనే స్విమ్మింగ్ పూల్ వంటి అత్యాధునిక సదుపాయాలతో ఈ స్కూల్‌ను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. 2028 చివరికల్లా నెల్లూరుని దేశంలోనే మోడల్ సిటీగా నిలబెడతామని మంత్రి నారాయణ తెలియజేశారు.
విద్యాసంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభిస్తామని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ హైస్కూల్స్ ను ఇదే స్థాయిలో అభివృద్ధి చేస్తామనన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ 2028 చివరికల్లా నెల్లూరుని దేశంలోనే మోడల్ సిటీగా నిలబెడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ రూప్ కుమార్, కార్పొరేటర్లు షేక్ షబానా బేగం, షేక్ కరీముల్లా, పఠాన్ ఎం.డి. జుబేర్ ఉద్దీన్ , షేక్ నజీమా, షేక్ షాహీనా, నాయకులు మైనుద్దీన్ భాయ్, జాఫర్ మరియు నౌషాద్ మరియు ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

