AP&TGDISTRICTSPOLITICS

వైకాపా కంచుకోట అయిన పులివెందల మున్సిపాలిటీని బద్దలు కొట్టిన కూటమి!

కడప జిల్లాలో వైసీపీకి కొలుకోలేని దెబ్బ..?

టీడీపీ 4,బీజెపీ 1…..

అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీ.ఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల  మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. దశాబ్దాలుగా YSR కుటుంబానికి తిరుగులేని రాజకీయ కోటగా ఉన్న పులివెందుల పురపాలక సంఘం చరిత్రలోనే మొదటి సారిగా తెలుగుదేశం పార్టీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయంలో సంచలనంగా మారింది.కూటమి(టీడీపీ) అభ్యర్ది తూగుట్ల గీత 13,875 ఓట్ల భారీ మెజారిటీతో వైకాపా అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మపై విజయం సాధించారు. పులివెందుల మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో వైకాపా అభ్యర్థి వై.ఎస్. ప్రమీలమ్మపై ఎన్డీయే కూటమి అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది.

వైకాపా కేవలం 3 వార్డులకే పరిమితం:- పులివెందులలోని మొత్తం 40 వార్డులకు గాను 20 స్థానాలు గతంలోనే ఏకగ్రీవం కాగా, మిగిలిన 20 వార్డులకు తీవ్ర ఉత్కంఠ మధ్య పోలింగ్ జరిగింది. వెలువడిన ఫలితాల్లో తెదేపా 15 వార్డులు, జనసేన 1, భాజపా 1 వార్డును గెలుచుకుని మొత్తం 17 చోట్ల విజయం సాధించగా, వైకాపా కేవలం 3 వార్డులకే పరిమితమైంది.

కడప జిల్లాలో వైసీపీకి కొలుకోలేని దెబ్బ:- కడప జిల్లాలో ఇప్పటికే బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీను టీడీపీ గెలుచుకుంది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీని బీజేపీ గెలుచుకుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *