AP&TGDISTRICTS

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను-రాష్ట్రానికి భారీ వర్ష సూచన

తెల్లవారుజాము ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం?..

నెల్లూరుకు 100 కి.మీ., కావలికి 120 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతం..

అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపాను కొనసాగుతోంది. గడ,ప 6 గంటల్లో గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను ప్రస్తుతం నెల్లూరుకు 100 కిలోమీటర్లు, కావలికి 120 కిలోమీటర్లు, తిరుపతికి 160 కిలోమీటర్లు, ఒంగోలుకు 160 కిలోమీటర్లు, బాపట్లకు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సోమవారం  అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచన వేస్తున్నారు.

5 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు:- తుపాను ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

అత్యంత అప్రమత్తంగా ఉండాలి:- తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ సూచించారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *