AP&TGCRIMEDISTRICTS

పదవ తరగతి విద్యార్దినిపై చెట్లు కట్ చేసే రంపం మెషీన్ తో యువకుడు దాడి

దుండగుడు,ఉన్మాదిలా ప్రవర్తిస్తూ..

ధర్మవరం మండలానికి చెందిన..

అమరావతి: రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పాఠశాల తరగతి గదిలో ఉన్న 10 క్లాస్ బాలికపై, చెట్లు కట్ చేసే రంపం మెషీన్ తో ఓ యువకుడు శనివారం దాడి చేశాడు. విద్యార్థినిపై జరిగిన దాడి సంఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.

దుండగుడు,ఉన్మాదిలా ప్రవర్తిస్తూ:- శనివారం ఉదయం పాఠశాలలో ఉపాధ్యాయురాలు మ్యాథ్స్‌ క్లాస్‌ చెబుతుండగా, చెట్లు నరికే రంపం మెషిన్‌తో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు,ఉన్మాదిలా ప్రవర్తిస్తూ, విద్యార్థిని ముఖం, ఒంటిపై ఎక్కడికక్కడ నరికాడు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. అడ్డుకోబోయిన మరో విద్యార్థిని కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడిఉన్న ఇద్దరినీ స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి ఎమర్జెన్సీ వార్డు ఆపరేషన్‌ థియేటర్‌లో శస్త్రచికిత్స జరుగుతోంది. పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ధర్మవరం మండలానికి చెందిన:- రాప్తాడు ఘటనలో ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ?. ఘటన అనంతరం నిందితుడు ధర్మవరం వైపు వెళ్తుండగా పట్టుకున్నట్లు సమాచారం! దుండగుడిని ధర్మవరం మండలానికి చెందిన యువకుడిగా గుర్తించినట్లు తెలుస్తొంది.అలాగే బాలికకు సమీప బంధువే దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *