DISTRICTS

మైనింగ్ మాఫియా నుంచి మిడతల రమేష్ కు బెదిరింపులు-కందికట్ల రాజేశ్వరి

నెల్లూరు: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కొరినందుకు బిజెపి నేత మిడతల రమేష్ కు బెదిరింపులు వస్తున్నాయని బిజెపి మహిళ నేత కందికట్ల రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు.ఆక్రమాలను ప్రశ్నిస్తూన్న మిడతల రమేష్ పై వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రమేష్ కు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ విజయ్ కుమార్ కు వినతి పత్రిం అందించినట్లు పేర్కొన్నారు. స్వర్ణముఖి నది నుండి వందల ట్రాక్టర్లు టిప్పర్లు ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే ఇందుకు అధికారులు అక్రమ మైనింగ్ కు అండగా నిలిచారని ఆరోపించారు.స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాన్ని రక్షించమని అధికారులకు విజ్ఞప్తి చేయడంపై మైనింగ్ మాఫియా ఇలాంటి ప్రయత్నాలకు పాల్పపడుతున్నరని ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ కార్యకలాపాలకు అడ్డు వస్తే ప్రభుత్వం మాది స్వర్ణముఖి నదిలో పాతేస్తామని దొరువు కట్ట గ్రామంలో చర్చించినట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ఇసుక అక్రమ రవాణా నివారించాలని బిజెపి నేతలు పిజిఆర్ఎస్ లో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి,సాంబశివారెడ్డి, రఘురామయ్య,యనమల నాగేశ్వరరావు,సుజన,ఆదినారాయణ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *