AP&TGNATIONALTECHNOLOGY

ముగ్గురు సైంటిస్టుల సూక్ష్మ రూపాలను అంతరిక్షంలోకి పంపనున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్’

అమరావతి: భారతదేశానికి చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ చరిత్రాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. Skyroot సంస్థ ఈ జూలైలో ‘మిషన్ ఆగమన్’ పేరిట ‘విక్రమ్-I’ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య కాలంలో అంతరిక్షంలోకి ప్రయోగించనున్నట్లు స్కైరూట్ ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి ‘విక్రమ్-I’ రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను అంతరిక్షంలోకి పంపనుంది. మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ 18 క్యారెట్ల బంగారంతో ఒక చిన్న రాకెట్ ఆకృతిని తయారు చేసి, అందులో ఈ ముగ్గురు సైంటిస్టుల విగ్రహాలను చెక్కారు. ఈ విగ్రహాలు ఒక్కోటి బియ్యపు గింజ కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో సూపర్ పవర్‌గా నిలిపిన ఆ ముగ్గురు మహానుభావుల గౌరవార్థం స్కైరూట్ ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది.

విక్రమ్-1 మల్టీ స్టేజ్, కార్బన్-మిశ్రమ కక్ష్య రాకెట్. ఇది 350 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను తక్కువ భూ కక్ష్య (LEO)లోకి మోసుకెళ్లగల సామర్థ్యాన్ని దినికి ఉంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *