INTERNATIONALNATIONALOTHERS

శ్రీలంక జైలులో జరిగిన ఘోరమైన ఘర్షణల్లో 25 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

అమరావతి: శ్రీలంకలోని నెగొంబో జైలులో జరిగిన ఘోరమైన అల్లర్లు, ఘర్షణల్లో కనీసం 25 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం శ్రీలంక జైలును రావణకాష్టంలా మార్చిం ది. పరస్పర దాడుతో జైలు పరిసరాలు యుద్ధభూమిని తలపించాయి. శ్రీలంకలోని ఓ జైలులో జరిగిన ఘర్షణ ల్లో నలుగురు గార్డులతో సహా 25 మంది మరణించగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా:- వేలాది మంది ఖైదీలు ఉన్న నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలకు చెందిన ఖైదీల మధ్య గొడవ ప్రారంభమై భౌతిక దాడులకు దిగారని అధికారులు తెలిపారు. హింస,అల్లర్లను అదుపు చేసేందుకు ప్రయత్నించిన జైలు సిబ్బంది, అధికారులతో ఖైదీలతో భౌతిక ఘర్షణలకు దారితీసింది.

అత్యంత ఘోరమైన జైలు అల్లర్లు:- సోమవారం శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు కమాండోలను రంగంలోకి దించింది. జైలు ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి వైమానిక దళం డ్రోన్‌లు, హెలికాప్టర్‌ను మోహరించారు. విషయం తెలుసుకున్న ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయట గుమిగూడారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన జైలు అల్లర్లు అని స్థానిక అధికారులు తెలిపారు. జైలు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. క్షతగాత్రుల్లో కొందరికి తుపాకీ బుల్లెట్ గాయాలు కాగా, మరికొందరికి తీవ్రమైన దెబ్బలు తగిలాలయని హాస్పిటల్‌ డైరెక్టర్ పుష్ప గమ్లత్ తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *