INTERNATIONALNATIONALOTHERS

ప్రధాని మోదీకి ఇండోనేషియాలో ఘనస్వాగతం పలికిన అధ్యక్షుడు ప్రబోవో

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన బాగంగా సోమవారం జకార్తాలో చేరుకోగానే  ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి,ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.ఈ అద్భుతమైన ఆతిథ్యానికి ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘2018లో ఇరు దేశాల బంధాన్ని ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’గా మార్చుకున్నాం.ఈ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి పలు కీలక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నాం. అలాగే యోగ్యకర్తలోని ప్రసిద్ధ ‘ప్రాంబనన్ దేవాలయ’ సముదాయాన్ని సందర్శించనుండటం ఇరు దేశాల సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.

‘బ్రహ్మోస్’:- భారతదేశానికి చెందిన శక్తివంతమైన ‘బ్రహ్మోస్’ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఇండోనేషియా ఒప్పందం కుదుర్చుకుంది.ఇప్పటికే ఫిలిప్పీన్స్ 375 మిలియన్ల డాలర్లతో బ్రహ్మోస్ కొనుగోలుకు తొలి ఒప్పందం చేసుకుంది. ఇండోనేషియా కూడా అదే బాటలో భారత్ రక్షణ ఎగుమతులను కొనుగొలు చేయనున్నది. ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక, ఆర్థిక బంధాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చనుంది.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *