మునిసిపాల్,నగరపాలక సంస్థల ఎన్నికలకు నవంబర్ 1వ తేదీన పోలింగ్!
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను రీషెడ్యూల్..
అమరావతి: రాష్ట్రంలో 99 మునిసిపాల్,నగరపాలక సంస్థల ఎన్నికలకు నవంబర్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ను రీషెడ్యూల్ చేస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 జరగాల్సిన ఎన్నికలను నవంబర్ 1వ తేదీకి రీషెడ్యూల్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఫలితాలను నవంబర్ 3న విడుదల చేయనున్నట్టు పేర్కొంది. ఈ నెల 25వ తేదిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారమని ఈసీ పేర్కొంది. మైదుకూరు పురపాలక సంఘానికి పోలింగ్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా వాయిదా వేశారు. మైదుకూరులో మళ్లీ నామినేషన్లు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై:- 7 జిల్లాలోని 19 పురపాలక సంఘాల నామినేషన్స్ పై ఆరోపణలు రావడంతో వీటిపై కలెక్టర్ల నుంచి నివేదికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అందుకున్నారు. న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం అక్టోబరు 28వ తేదిన జరగాల్సిన పోలింగ్ ను నవంబర్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలా? లేదా అనే అంశంపై ఇంక స్పష్టత రాలేదని సమాచారం.?

