NATIONAL

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం,ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న సంక్షోభం త్వరలోనే తొలగిపోవాలి-ప్రధాని మోదీ

భార‌త్, పోలండ్ మ‌ధ్య ద్వైపాక్షిక బంధం..

అమరావతి: ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం,అలాగే ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న సంక్షోభం కూడా తొందరలోనే ముగిసిపోవాల‌ని కోరుకుంటున్నామ‌ని,శాంతియుద పాలన వ్యవస్థల వైపే భార‌త్ నిలుస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ స్పష్టం చేశారు. గురువారం పోలండ్ ప్ర‌ధాని డొనాల్డ్ ​ట‌స్క్​తో క‌లిసి ఢిల్లీలో మీడియా స‌మావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్ర‌జాస్వామ్య విలువ‌లపై భార‌త్, పోలండ్ దేశాలకు న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌ను మ‌రింత బలోపేతం చేయ‌డానికి అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌ల్లో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌న్నారు. భార‌త్, యూరోపియ‌న్ యూనియ‌న్ మ‌ధ్య కుదిరిన స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం అద్భుత‌మ‌ని, భార‌త్, పోలండ్ మ‌ధ్య ఆర్థిక స‌హకారం మరింత బ‌లోపేతం అయ్యేలా ఆ ఒప్పందం స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. అలాగే ర‌క్ష‌ణ‌, అంత‌రిక్షం, న్యూక్లియ‌ర్ ఎన‌ర్జీ రంగాల్లోనూ స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు భార‌త్, పోలండ్ ఒప్పందం చేసుకున్నాయ‌ని ప్ర‌ధాని మోదీ వెల్లడించారు.

పోలండ్ ప్ర‌ధాని డొనాల్డ్ ట‌స్క్ మాట్లాడుతూ, భార‌త్, పోలండ్ మ‌ధ్య ద్వైపాక్షిక బంధంపై ప్రశంసలు కురిపించారు. ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత మెరుగ‌వ‌డానికి రెండు దేశాలూ మ‌రింత‌గా స‌హ‌క‌రించుకుంటాయ‌న్నారు. శాటిలైట్లు, డ్రోన్ల రంగాల్లో ఆ రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం,, ప్ర‌పంచ దేశాలు రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు, సంక్షోభాలను త‌గ్గించుకునేందుకు సాయం చేసింద‌న్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *