ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల- ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభం
అమరావతి: ఇంటర్మీడియట్ 2027 పరీక్షల టైమ్ టేబుల్‌ను ఇంటర్ బోర్డ్ సెక్రటరీ రంజిత్ భాష విడుదల చేశారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు,ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనుంది.ఈ మేరకు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశాడు.
పరీక్షల వివరాలు:- 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 24 నుంచి ఫస్ట్ ఇయర్, ఫిబ్రవరి 25 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రెగ్యులర్‌తో పాటు బ్యాక్లాగ్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ప్రాక్టికల్స్:- జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతాయి.
ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయి – ఉదయం 9 నుంచి 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్.
ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:-
ఫిబ్రవరి 24, బుధవారం – భాషలు పేపర్-1
ఫిబ్రవరి 26, శుక్రవారం – ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 1, సోమవారం – గణితం / సివిక్స్ పేపర్-1
మార్చి 3, బుధవారం – బయాలజీ / హిస్టరీ పేపర్-1
మార్చి 5, శుక్రవారం – ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-1
మార్చి 9, మంగళవారం – కెమిస్ట్రీ / కామర్స్ పేపర్-1
మార్చి 12, శుక్రవారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్-1
మార్చి 15, సోమవారం – మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-1
సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:-
ఫిబ్రవరి 25, గురువారం – భాషలు పేపర్-2
ఫిబ్రవరి 27, శనివారం – ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 2, మంగళవారం – గణితం / సివిక్స్ పేపర్-2
మార్చి 4, గురువారం – బయాలజీ / హిస్టరీ పేపర్-2
మార్చి 8, సోమవారం – ఫిజిక్స్ / ఎకనామిక్స్ పేపర్-2
మార్చి 11, గురువారం – కెమిస్ట్రీ / కామర్స్ పేపర్-2
మార్చి 13, శనివారం – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ పేపర్-2
మార్చి 16, మంగళవారం – మోడ్రన్ లాంగ్వేజ్ / జాగ్రఫీ పేపర్-2 జరుగుతాయి.

