మరింత కఠినంగా బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు అమోదం
అమరావతి: బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ అధ్యక్షతన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారం నాడు ఆమోదం తెలిపింది.. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈ రోజు సభ ఆమోదించింది..
(సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే కన్వర్షన్ కేసుల్లో FIR నమోదు చేయవచ్చు.. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు, తల్లిదండ్రులు, తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది.. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థలను పరిశీలించరాదు.. తీవ్రవాదం,,మనీలాండరింగ్ కేసుల్లో నిందితులపై తీసుకునే చర్యలు లాగానే కఠినమైన బెయిల్ షరతులను ప్రతిపాదించింది.)
నాలుగు సంవత్సరాల క్రితం, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ చట్టవిరుద్ధమైన మత మార్పిడిని నిషేధించే చట్టం-2021ను సవరణలతో ఆమోదించింది..సోమవారం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించడానికి కొత్త బిల్లును ప్రవేశపెట్టింది..ఇది మరింత కఠినంగా,,విస్తృతంగా అమలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది..
సవరించిన బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా యావజ్జీవ జైలుశిక్ష పడుతుంది.. సవరించిన నిబంధనల ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం, వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవరు పాల్పడినా అది తీవ్ర నేరంగా పరిగణిస్తారు..అలాంటి కేసుల్లో 20 ఏళ్లు జైలు కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు..గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడన వారికి పదేళ్ల జైలు, రూ.50,00 జరిమానా ఉండేది..