ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వద్ద భారీ పేలుడు
అమరావతి: ఢిల్లీలోని రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని CRPF పాఠశాల వెలుల ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది.. ఈ అనుమానాస్పద ఘటనలో పాఠశాల గోడ ధ్వంసమైంది..సెలవు రోజు కావడంతో విద్యార్దులు ఎవ్వరు లేక పోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.. పాఠశాల సమీపంలో పార్క్ చేసిన కార్లు, చుట్టపక్కల ఇళ్ల అద్దాలు పగిలిపోగా,, దుకాణాల నేమ్ బోర్డులు దెబ్బతిన్నాయి.. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించిందని స్థానికులు తెలిపారు..ఘటన గురించి సమాచారం అందుకున్న ఫోరెన్సిక్ బృందాలు, క్రైమ్, బాంబు డిస్పోజల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.. ఫోరెన్సిక్ నిపుణులు పాఠశాల గోడ వద్ద తెల్లని పౌడర్ గుర్తించారు.. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.. దానితో పాటు పాఠశాల సమీపంలోని మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు.. ఎవరైనా దాడికి పాల్పడ్డారా లేదా భూగర్భ మురుగునీటి లైన్‌లోని వాయువు- పేలుడుకు కారణమైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు దీల్లీ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పేడులు నేపథ్యంలో దిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండుగ సీజన్ కావడం వల్ల వివిధ మార్కెట్లల్లో పెట్రోలింగ్ చేయనున్నట్లు చెప్పారు..ఈ ఘటనపై పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
రంగంలోకి దిగిన NSG,,NIA బృందాలు:- CRPF పాఠశాల బాంబు పేలుడు కలకలం సృష్టించిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్,, నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి.. మరిన్ని ఆధారాల కోసం స్నిఫర్ డాగ్స్ తో గాలింపు చర్యలు చేపట్టారు..సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించడానికి రోబోలను ఉపయోగిస్తున్నారు.